జార్ఖండ్ : మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకులు శిబూ సోరెన్ (ShibuSoren) (81) ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రి (Ganga Ram Hospital in Delhi) లో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. జూన్ చివరి వారంలో కిడ్నీ సంబంధిత సమస్యతో శిబు సోరెన్ ఆసుపత్రిలో చేరారు.
గురూజీ అని ముద్దుగా పిలువబడే సోరెన్.. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం (Jharkhand State) కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గిరిజన, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.
ప్రస్తుత ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) ఆయన కుమారుడు. తన తండ్రి మరణాన్ని ధృవీకరిస్తూ హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu), కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆస్పత్రికి వెళ్లి శిబు సోరెన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు.