Forest Department |ఉగాది ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక…

Forest Department | ఉగాది ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక…

కాలిబాటల ఇతర రాష్ట్రాల నుంచి కట్టెల కాళ్లతో మొక్కుబడి ప్రయాణం…
దర్శనం ఏర్పాట్లు పకడ్బందీగా అమలు…

Forest Department | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా లోని శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఉగాది మహోత్సవాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ముందస్తుగానే క్షేత్రాన్నికి చేరుకుంటున్నారు. గురువారం నాడు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు శ్రీశైలంకు కాలిబాటన కాళ్ళ కర్రలకు మొక్కుబడి తీర్చుకోవటానికి వేలాది మంది తరలి వస్తున్నారు.

గురువారం నాడు కాలిబాటగా ప్రయాణం ప్రారంభిస్తున్నారు. భక్తులరద్దీని అనుసరించి దర్శనం ఏర్పాట్లు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి లోనుకాకుండా ప్రశాంతంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునే విధంగా దర్శనం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. ఉగాది మహోత్సవాలలో భక్తులందరికీ గతంలో వలనే శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు.

Forest Department |

ఈ నెల 6 నుంచి స్పర్శదర్శనం కల్పించబడుతోందన్నారు. క్యూకాంప్లెక్సు విభాగం, ఆలయ విభాగం పరస్పర సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా విడతలవారిగా స్పర్శదర్శనం, అలంకారదర్శనాన్ని కల్పించారు. క్యూకాంప్లెక్సు, క్యూలైన్లలో వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాన్ని అందిస్తుఉన్నారు.

Forest Department |

క్యూకాంప్లెక్సులోని ఫ్యాన్లు, కూలర్లు సజావుగా పనిచేసేవిధంగా తగు పర్యవేక్షణ చేస్తున్నారు.సిబ్బంది అందరు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వర్తిస్తుఉన్నారు. క్యూలైన్ల నిర్వహణలో పోలీసుశాఖ వారి పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికారులు ఆదేశించారు.

Forest Department |

కాలిబాట ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు…

Forest Department |

ఉగాది ఉత్సవాలకు కాలిబాట మార్గములో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో పాటు అందరికీ కూడా ఆధునిక సౌకర్యాలు అధికారులు కల్పిస్తున్నారు. ఆత్మకూరు ప్రాంతం నుంచి వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా క్షేత్రానికి 41 కిలోమీటర్లు పాదయాత్ర మీదుగా కాళ్లకు కట్టెలు కట్టుకొని రావడం జరుగుతున్నదన్నారు. ఇప్పటికే పాదయాత్ర భక్తులు శ్రీశైలక్షేత్రాన్ని చేరుకోవడం జరుగుతుందన్నారు.

Forest Department |

అటవీశాఖ అధికారుల సమన్వయంతో కాలిబాట ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాలిబాటలో భక్తులకు మంచినీటిని అందించడములో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ఎటువంటి అంతరాయం లేకుండా నీటిసరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టారు.కాలిబాట మార్గంలోని నాగలూటి, పెచ్చెర్వు, కైలాసద్వారం మొదలైన చోట్ల మరియు శ్రీశైలక్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుండి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అధికారులు అందిస్తున్నారు.

Forest Department |

ఉత్సవాలలో క్షేత్రపరిధిలో కూడా పలుచోట్ల భక్తులు అన్నదానం చేపట్టారు. అన్నదాన బృందాలన్నింటికి దేవస్థానం తరుపున ఆయా ఏర్పాట్లను చేయాలని ఇంజనీరింగ్, అన్నప్రసాద వితరణ విభాగాలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా అన్నదాన ప్రాంతాలలో పైప్ పెండాల్స్, లైటింగు ఏర్పాట్లు ఉండాలన్నారు. సుజూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇప్పటికే శ్రీశైలం ప్రాంతానికి చేరిపోవుతున్నారు.

Forest Department |

CLICK HERE TO READ MORE : బ్రహ్మాండం.. బ్రహ్మ రథోత్సవం

CLICK HERE TO READ MORE :

Leave a Reply