Peddapalli | ఆర్టీవో అధికారుల బలవంతపు వసూళ్లు… బాధితుడి నిరసన
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రతినెలా మామూళ్ళు అడుగుతున్నారని ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీ ఓనర్ నిరసనకు దిగాడు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం వద్ద లారీపైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుంటానని బసంత్ నగర్ కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసనకు దిగాడు.
ఆర్టీఏ అధికారులు మామూళ్ళు ఇవ్వనందుకు తన లారీపై కేసు చేసినట్టు, ఒక్కో లారీకి నెలకు రూ.8000ల లంచం వసూలు చేస్తున్నట్టు ఆరోపించాడు. ఇప్పటికైనా అధికారులు మామూళ్ళు వసూలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ సిబ్బంది కిందికి దిగాలని విన్నవించినా.. అనిల్ గౌడ్ ఒప్పుకోకపోవడంతో పాటు తనను లంచం అడిగిన అధికారులను సస్పెండ్ చేస్తేనే దిగుతానని పేర్కొన్నారు.