Forbesganj | ఇద్దరు బలి…

Forbesganj | ఇద్దరు బలి…

Forbesganj | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీహార్‌లోని ఫోర్బ్స్‌గంజ్‌లో పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న గొడవ ఘోర పరిణామాలకు దారితీసింది. క్షణికావేశంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. బీహార్ రాష్ట్రంలోని ఫోర్బ్స్‌గంజ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదం చివరికి రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన డ్రైవర్ నబీ హుస్సేన్, సత్తు వ్యాపారి రవి చౌహాన్ మధ్య పార్కింగ్ విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి లోనైన రవి చౌహాన్ కత్తితో నబీ హుస్సేన్ గొంతు కోసి హత్య చేశాడు.

ఈ ఘటనను చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై రవి చౌహాన్‌పై దాడి చేశారు. జనాలు అతడిని కొట్టి చంపారు. క్షణికావేశంలో జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply