సముద్రాల అభివృద్ధి కోసం.. సర్పంచ్‌గా ఒక అవకాశం ఇవ్వండి

  • గ్రామంలో అర్హులందరికీ స్కీమ్‌లు అందేలా చూస్తాను.
  • ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను.
  • సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకటేశ్వర్ రెడ్డి

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మన సముద్రాల గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌గా ఒక అవకాశం ఇవ్వాలని ఇనుగాల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. గ్రామంలోని అర్హులందరికీ అన్ని ప్రభుత్వ స్కీమ్‌లు అందేలా చూస్తానని, ముఖ్యంగా ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు.

ఆదివారం రాత్రి ఆయన మండలంలోని సముద్రాల గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సర్పంచ్‌గా గెలిపించి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని ఓటర్లను ఆకర్షించారు.

ఈ సందర్భంగా అభివృద్ధి హామీలను కూడా ప్రకటించారు. కడియం శ్రీహరి సహకారంతో గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రధానంగా ఎమ్మెల్యే సహకారంతో సముద్రాల నుంచి సూరారం వయా చర్ల తండా వరకు బీటి రోడ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. సముద్రాల నుంచి షాపెల్లి, సముద్రాల ఎస్సీ కాలనీ నుంచి ఇప్పగూడెం ఎస్సీ కాలనీ రోడ్లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను అందిస్తానని, నారాయణపురం 33/కెవి సబ్ స్టేషన్ ఉపకేంద్రానికి శంకు స్థాపన చేస్తానని చెప్పారు. నారాయణపురంలోని అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని, సీతా తండా నుంచి ఎలబోయిన ఇండ్ల వరకు రోడ్డు, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తానని వెల్లడించారు.

ప్రభుత్వ సహకారంతో యాదవ్ సంఘ భవనం నిర్మాణం, హైస్కూల్ నుంచి బస్టాండ్ వరకు విద్యుత్ లైన్ల కోసం స్తంభాలు ఏర్పాటు, బస్టాండ్ వద్ద సెంట్రల్ లైటింగ్, ఎస్సీ కాలనీ చుట్టూ విద్యుత్ లైట్లు, ఎమ్మెల్యే సహకారంతో హైమాక్స్ లైట్స్ ఏర్పాటు, జిపి భవనం పైన మరో భవనం నిర్మాణం వంటి పనులు చేపడతానని స్పష్టం చేశారు.

మొత్తంగా, రాజకీయాలకు తావులేకుండా నిరంతరం పారదర్శక పాలన అందిస్తానని, స్వచ్చ గ్రామం లక్ష్యంగా పనిచేస్తానని ఇనుగాల వెంకటేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

Leave a Reply