రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు..

ఉట్నూర్, (ఆంధ్రప్రభ): అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్(బి) ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనక్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాథోడ్ ప్రకాష్ వెల్లడించారు.
2025–26 జిల్లాస్థాయి జోనల్ లెవెల్ క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థినీలు శైలజ, గోదావరి, దేవు బాయి, భాగ్యవతి, రాం బాయిలు రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను చాటుకునే అవకాశాన్ని పొందారని ఆయన తెలిపారు.
అదే పాఠశాలకు చెందిన విద్యార్థిని కళ్యాణి ఇన్స్పైర్ అవార్డు అందుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు చెప్పారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇన్స్పైర్ అవార్డు పొందిన కళ్యాణికి అవార్డు పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గైడ్ ఉపాధ్యాయులు జైవంతరావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
