Football| వార్ ఎఫెక్ట్..

Football| వార్ ఎఫెక్ట్..
ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దాడులు
అమెరికాలో ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీ
ఈ ఏడాది జూన్–జూలైలలో పోటీలు
వైదొలగనున్న ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీ యుద్ధం ఎఫెక్ట్ పడింది. మిత్రదేశం ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు చేస్తోన్న నేపథ్యంలో ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి ఇరాన్ వైదొలిగినట్లు సమాచారం. అమెరికాలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టోర్నీనే బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్–జూలైలలో అమెరికా, మెక్సికో, కెనడాలలో ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీలో ఇరాన్ జట్టు బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
