భోజ‌నంలో 100 శాతం నాణ్య‌త‌ ఉండాలి..

భోజ‌నంలో 100 శాతం నాణ్య‌త‌ ఉండాలి..

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం(lunch)లో పరుగులు వచ్చాయి. ఈ రోజు మధ్యాహ్న భోజన సమయంలో కొంత ఆలస్యంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు .ఈ సమయంలో ఓ విద్యార్థి ప్లేట్లోని అన్నంలో పురుగు కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఏబీవీపీ(ABVP) నాయకులు ఆందోళన చేపట్టారు.

విషయం తెలుసుకున్నఎంఈఓ అనిల్ గౌడ్(MEO Anil Goud) పాఠశాల వద్దకు చేరుకొని అన్నంలో పురుగులు వచ్చిన విషయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నంలో పురుగు రావడంతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, వంట ఏజెన్సీ(Cooking Agency) సభ్యులు అందుబాటులో ఉండాల్సిన వారంతా లేకపోవడం కారణాలతో వంట చేసే ఏజెన్సీ ని రేపటి నుండి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మారుస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్న భోజన విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

విద్యార్థులకు పెట్టే భోజనం పూర్తిగా 100 శాతం నాణ్యత ఉండాలని అన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ నిర్లక్ష్యమ‌ని తేలడంతో ఏజెన్సీని మార్చి వేస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం నుండి వేరే ఏజెన్సీకి మధ్యాహ్న భోజనం బాధ్యతలు అప్పగించనున్నట్లు ఎంఈఓ అనిల్ గౌడ్ తెలిపారు.

Leave a Reply