ట్రాఫిక్ నియమాలు పాటించండి..ప్రమాదాలను దూరం పెట్టండి

ట్రాఫిక్ నియమాలు పాటించండి..ప్రమాదాలను దూరం పెట్టండి

  • ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాల నివారించవచ్చు
  • అరైవ్ అలైవ్ కార్యక్రమంతో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు
  • హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరి ఉపయోగించాలి
  • ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు..
  • స్టేషన్ ఘన్ పూర్ సీఐ జి. వేణు

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ట్రాఫిక్ నియమాలు పాటించండి..ప్రమాదాలను దూరం పెట్టండి..ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను నివారించ‌వ‌చ్చ‌ని స్టేషన్ ఘన్ పూర్ సీఐ జి.వేణు అన్నారు. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమమే అరైవ్ అలైవ్ కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో పోలీస్ రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా డాక్టర్ హేమంత్ సహకారంతో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సద స్సులో సీఐ వేణు మాట్లాడారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధ న్యత నియమాల గురించి వివరించారు.

రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమా దాలను అరికట్టవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల ఆరో గ్యం కీలక పాత్ర పోషిస్తుందన్నారు..ముఖ్యంగా కంటి చూపు సరిగ్గా లేక పోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. రోడ్డుపై విధుల్లో పోలీసులు ఉన్నా లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి తమ ప్రాణ భద్రతతో పాటు,ఇతరుల భద్రతకు కూడా సహకరించాలని ఉద్యో గులు, ప్రజలకు ఆయ‌న విజ్ఞప్తి చేశారు. అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవ ర్ లోడ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ లు బి. వినయ్ కుమార్, రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply