Flying Squad | ఎన్నికల కోడ్ అమల్లో వాహనాల తనిఖీలు…

Flying Squad | ఎన్నికల కోడ్ అమల్లో వాహనాల తనిఖీలు…

Flying Squad | అచ్చంపేట, ఆంధ్రప్రభ : మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అచ్చంపేట మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్(Flying Squad) బృందం విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఈ రోజు అచ్చంపేట వై జంక్షన్ ప్రధాన రహదారిపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ప్రత్యేక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి వాహనాలను పరిశీలించారు.

కార్లు, ద్విచక్ర వాహనాలను ఆపి డిక్కీలు తెరిచి నగదు, మద్యం, ఇతర అనుమానాస్పద వస్తువుల రవాణా జరుగుతుందా అనే విషయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైన్ స్క్వాడ్(line squad బృందానికి నేతృత్వం వహిస్తున్న నాయబ్ తహసిల్దార్ (ఎలక్షన్స్) రాత్లావత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అక్రమంగా 50 వేలకు మించి నగదు లేదా ప్రలోభకర వస్తువుల రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలతో పాటు పట్టుబడిన సత్తును జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో హెడ్ కానిస్టేబుళ్లు ఎం.డి. నజీర్, వెంకటేష్, పిసీ సంతోష్ పాల్గొన్నారు.

Leave a Reply