భూపాల‌ప‌ల్లి జిల్లా ప్ర‌తినిధి : గోదావ‌రి (Godavari) శాంతించింది. నిన్న సాయంత్రం వ‌ర‌కు ప‌ర‌వ‌ళ్లు తొక్కిన గోదావ‌రిలో నీటి ఉధృతి త‌గ్గింది. బుధ‌వారం కాళేశ్వ‌రం (Kaleshwaram) వ‌ద్ద గోదావ‌రి న‌ది వ‌రద‌ను గ‌మ‌నించిన అధికారులు మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక (First Flood Warning) జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే నీటి ప్ర‌వాహం త‌గ్గిన త‌ర్వాత మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రికాను అధికారులు ఉప‌సంహ‌రించారు.

గురువారం ప్రధాన పుష్కర ఘాట్ (Pushkar Ghat) వద్ద 11.680 మీటర్ల ఎత్తులో నీరు ప్ర‌వ‌హిస్తోంది. సాయంత్రం వరకు వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కు 9,89,620 నీరు వస్తుండడంతో 85 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో అవుట్ ఫ్లో (Outflow) పంపిస్తున్నారు.

Leave a Reply