సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

  • భూత్పూర్ నేరడగం ముంపు గ్రామాలుగా గుర్తింపు
  • త్వరలో డిఎన్ ప్రకటనకు ప్రభుత్వం నిర్ణయం

మక్తల్, ఆంధ్రప్రభ: బీమా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన సంగంబండ ,భూత్పూర్ రిజర్వాయర్ల కింద ముంపునకు గురవుతున్న భూత్పూర్, నేరేడుగం గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో డిఎన్ ప్రకటించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రెండు గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ,డాక్టర్ వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

మక్తల్ పట్టణంలోని 167 వ జాతీయ రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తిస్తూ 22 జీఓ విడుదల చేయగా పదేళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ముంపు గ్రామాలుగా గుర్తించకుండా నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు.

తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ,ఆర్థిక శాఖ మంత్రి తికలిసి రెండు గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామాభని అన్నారు. త్వరలోనే డిఎన్ ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. భూత్పూర్ రిజర్వాయర్ కింద గ్రామం లోని ఇళ్లల్లోకి ఊటనీరు వచ్చి విష పురుగులతో సహజీవనం చేయాల్సిన దుస్థితి నెలకొంది అన్నారు .ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో భూత్పూర్ మాజీ ఎంపిటిసి కే. కుర్మయ్య గౌడ్,నేరడగొం మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు కె .చెన్నయ్య గౌడ్, నాగప్ప, చిన్న చెన్నయ్య గౌడ్, కుర్వ ఆనంద్ ,మాజీ ఎంపీటీసీ నాగప్ప ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కె.నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply