ఎన్టీఆర్ బ్యూరో ,ఆంధ్రప్రభ ; కృష్ణానది ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి తరలివస్తుంది. జిల్లాలో కురిసిన వర్షాలకు తోడు, బ్యారేజీ ఎగువ ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టుల నుండి వరద నీరు విడుదల చేయడంతో మంగళవారం ఉదయానికి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్, అవుట్ ఫ్లో లు 21 వేల క్యూసెక్కులుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రస్తుతం బ్యారేజీకి 20,748 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా సాగునీటి అవసరాల కోసం 2,623 క్యూసెక్కుల నీటిని కృష్ణ తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా విడుదల చేస్తుండగా, మిగులు జలాలు 18,125 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Exclusive | గాల్లో ప్రాణాలు..కాసుల యావే.. భద్రత గాలికే
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులుగా ఉండగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.07 టీఎంసీలకు చేరుకుంది. క్రమక్రమంగా బ్యారేజీకి వరద నీరు ప్రవాహం పెరుగుతుండడం, దిగువ ప్రాంతాలకు కూడా నీటిని పెద్ద ఎత్తున విడుదల చేస్తుండడంతో కృష్ణానది పరివాహక ప్రాంతాలతో పాటు ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న ప్రాంతాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అప్రమత్తంగా ఉన్న అధికారులు కృష్ణా నదిలోకి ఎవరు వెళ్లకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. సాయంత్రానికి ఈ నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.