అహ్మాదాబాద్ లో కుప్ప కూలిన ఎయిర్ ఇండియా ఫ్రమాదంలో వంద మందికి పైగా ప్రయాణీకులు మరణించి ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి.. రక్షించిన ప్రయాణీకులు సైతం అధికశాతం మందికి తీవ్రగాయాలయ్యాయి.. దట్టమైన పొగ తో అధికసంఖ్యలో మరణాలు సంభవించాయని అంటున్నారు.. ఇక ఈ విమానంలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రుపాని కూడా ఉన్నారు.. ఆయనకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం హాస్పటల్ కు తరలించారు. ఇక ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు, 10 మంది ఇతర సిబ్బంది ఉన్న్నారు..ఇక ప్రయాణీకులలో 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు.. 169 మంది భారతీయులు, ఏడుగురు పోర్చుగల్ దేశస్తులుండగా, ఒకరు కెనడియన్ . ఇక విమానంలో సుమిత్ సబర్వాల్, కేవ్ సుందర్ లు ఫైలెట్లు గా ఉన్నారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి…
విమానం క్రాష్ అవడం పట్ల ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.. ప్రయాణీకులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు.. అలాగే హోం మంత్రి అమిత్ షాను అహ్మాదాబాద్ కు వెళ్లవలసిందిగా కోరారు..