Flag March | నియమాలను తప్పనిసరిగా పాటించాలి

Flag March | నియమాలను తప్పనిసరిగా పాటించాలి
- ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలి
- వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్
Flag March | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ప్రజలందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలనీ, నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్(DCP Rajamahendra Nayak) హెచ్చరించారు. ఈ రోజు స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్‌మార్చ్(Flag March) నిర్వహించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావ రణంలో ఎన్నికలు జరుగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఎవరైనా గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడ టం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(Model Code of Conduct) ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్ప డితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
డబ్బులు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు జి. వేణు, రాఘవేంద్ర, ఎస్ఐలు వినయ్, రాజేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
