ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు..

ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు..

  • రూ.29 వేలు, 5 సెల్ ఫోన్లు, 1 బైక్ స్వాధీనం.

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రాఘవపూర్ శివారులో పేకాట శిబిరం పై పోలీసులు దాడి చేశారు. గుట్టుచప్పుడు కాకుండా తీన్ రమ్మి ఆడుతున్న ఐదుగురిని ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్దపల్లి పట్టణానికి చెందిన ముగ్గురు, కమాన్ పూర్ మండలం గుండారంకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి నుండి రూ. 29 వేలు నగదు, 5 సెల్ ఫోన్లు, 1 బైక్, 2 సెట్ల పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply