ప్రథమ ఇంటర్ థియరీ వార్షిక పరీక్షలు ప్రారంభం

ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ ; ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రథమ ఇంటర్ థియరీ వార్షిక పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు 8:30 వరకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఖమ్మం జిల్లాలో 66 పరీక్షా కేంద్రాలలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు ప్రారంభమయ్యాయి . విద్యార్థులు పరీక్ష కేంద్రాల బయట ఉన్న బోర్డుపై తమ హాల్ టికెట్ నెంబర్ల రూముల కేటాయింపును చూసుకొని పరీక్షా కేంద్రాలలోకి వెళ్లారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 బి ఎన్ ఎస్ చట్టం అమలులో ఉంది. పోలీసులు , ఏఎన్ఎం నర్సులు, కూడా విధులు నిర్వహిస్తున్నారు.
