తొలి బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరు

తొలి బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరు

కడియం రాకపై అప్రమత్తమైన పోలీసులు
మున్సిపాలిటీ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : నూతనంగా ఏర్పాటైన స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీలో నిర్వహిం చిన తొలి బడ్జెట్ సమావేశానికి శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యా లయానికి ఆయన రానున్న నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచే సుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు సమాచారంతో పోలీసులు కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాక సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కండువాలు కప్పి ఘనంగా ఆహ్వా నం పలకడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడంతో మున్సిపా లిటీ కార్యాలయం చుట్టుపక్కల పోలీసులు అప్రమత్తమయ్యారు. స్థాని క ఏసీపీ భీం శర్మ ఆధ్వర్యంలో సీఐలు వేణు, శ్రీనివాస్ రెడ్డి బలగాలతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీ సులు ముందస్తు చర్యలు చేపట్టి పరిస్థితిని నియంత్రణలో ఉంచారు.

Leave a Reply