Fires | గడ్డివాము దగ్ధం

Fires | గడ్డివాము దగ్ధం

Fires | రాయపోల్, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన‌ రాయపోల్ గ్రామానికి చెందిన ఇప్ప కృష్ణకు చెందిన గడ్డివాము ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. రైతు ఇప్ప కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… మధ్యాహ్నం సమయంలో ప్రమాద వశాత్తూ గడ్డి వాముకు మంటలు అంటుకుని సుమారు 300 మోపులు కాలిపోయినట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అగ్నిమాపక వాహనం సకాలంలో రావడంతో మరింత నష్టం జరగకుండా నిలువరించగలిగినట్లు తెలిపారు. గడ్డివాము పూర్తిగా కాలిపోవడంతో దాదాపు రూ.20వేల నష్టం జరిగినట్లు రైతు కృష్ణ తెలిపారు.

Leave a Reply