AP | పార్వతీపురంలో భారీ అగ్నిప్రమాదం..

విజయనగరం జిల్లా పార్వతీపురంలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పాత బస్టాండ్ వ‌ద్ద‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న స్క్రాప్‌ దుకాణం లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

అయితే, పెళ్లి ఊరేగింపులో భాగంగా బాణాసంచా కాల్చడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply