fire | గడ్డివాము దగ్ధం

fire | గడ్డివాము దగ్ధం
fire | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గడ్డివాము దగ్ధమైన సంఘటన మండలంలో బుదవారం జరిగింది. మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన పాలెపు విఠల్రావు అనే రైతుకు చెందిన గడ్డివాము గ్రామంలోని తన ఇంటి సమీపంలో నిలువ చేశాడు. అయితే ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పంటుకుంది.
విసయాన్ని గమనించిన గ్రామస్తులు ఫైర్ స్టేషన్కు అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. గడ్డివాము చుట్టూ నివాస గృహలు ఉండడంతో సమయానికి పైర్ ఇంజన్ రావడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఏడాదికి సరిపడ పశు గ్రాసంగా ఉపయోగించుకునే 6 ఎకరాల గడ్డివాము దగ్ధమై పోవడంతో రూ.80 వేలు నష్టం వాటిల్లిందని అలాగే పశువులకు మేత దొరకని పరిస్థితి దాపురించిందని బాధిత రైతు ఆవేధన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పిసి వినయ్ తోపాటు ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు మంటలను ఆర్చి వేసేందుకు తీవ్రంగా కృషి చేశారు.
