బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం..
పెద్దపల్లి రూరల్, నవంబర్ 6(ఆంధ్రప్రభ): రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామని పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష (Dasari Usha) తెలిపారు. పెద్దపల్లి పట్టణం అమర్ నగర్ చౌరస్తాలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మౌన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… బీసీలందరూ ఐక్యతను చాటాలని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ గొంతును బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్ల (42 percent reservation) సాధన కోసం రాజకీయ ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొందరు తమ ప్రయోజనాల పేరిట ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీసీలు మేల్కొని 42 శాతం రిజర్వేషన్లను సాధించుకునే శక్తిని నిరూపించాలని ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ నాయకులు శిలారపు పర్వతాలు యాదవ్, మంద భాస్కర్ యాదవ్, శివంగారి సతీష్, కావేటి రాజగోపాల్, బొంకూరి సురేందర్ సన్నీ, ఆక్కపాక తిరుపతి, తాండ్ర సదానందం, కంకటి శ్రీనివాస్, మిట్టపల్లి శ్రీనివాస్, పోసాని శ్రీనివాస్, జ్యోతి, సీఐపల్లి రవీందర్ పాల్గొన్నారు.

