ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవo

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవo
నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : ఆడపిల్లలను ఉన్నతంగా చడిచించినప్పుడే సంపూర్ణ మహిళా సాధికారిత సాధ్యమవుతుందని ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారూ. టీఎన్జీవోఎస్ జిల్లా శాఖ ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమారు నేతృత్వంలో బుధవారం స్థానిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి ఎన్ జి ఓ ఎస్ సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రత్యేకనంగా అభినందించారు.
అనంతరం కార్యక్రమ అతిథిగా పాల్గొన్న నగర మేయర్ ఉమారాణి దంపతులను శాలువాతో సత్కరించారు.అటు మరోవైపు మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించి, ప్రశంస పత్రాలను అందజేశారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.ఇటీవల టీఎన్జీవోఎస్ నిమిత్తం తన నియోజకవర్గంలో ఎకరం భూమి కేటాయించడం పట్ల టీఎన్జీవోఎస్ సంఘం వారు ఎమ్మెల్యే కు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు.

కాగా ఉద్యగుల సౌకర్యార్థం కళ్యాణ మండపం ఏర్పాటు, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు తదితర అంశాలను గురించి చేయాలని విన్నవించగా అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా సహకరిస్తానని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదంతో పాటు అసెంబ్లీ లో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని గజమాలతో సన్మానించారు. ఈ మేరకు ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు రూపొందిస్తే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఉద్యోగస్థులదే కీలక పాత్ర అన్నారు.

కాబట్టి ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా పని చేసి..ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చివరి లబ్ధిదారునికి అందేలా పనిచేయాలని సూచించారు. ఉద్యోగులు అందరూ తమ తమ పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను పెళ్లి పేరిట సంకెళ్లు వేయకుండా.. ఉన్నత చదువులు చదివించాలని అప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుందని తెలిపారు. తన నియోజకవర్గం సుమారు 160కి పైగా మహిళా సంఘ భవనాలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, పార్టీ నాయకులు రామచందర్ గౌడ్, అంబర్ సింగ్, డివిజన్ 1 కార్పొరేటర్ అగ్గు బోజన్న, టీఎన్జీవోఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారాం, రాష్ట్ర కార్యదర్శి పోలా శ్రీనివాస్, జిల్లా సహాయ అద్యక్షులు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నేతికుంట శేఖర్, మహిళా కార్యవర్గ సభ్యురాలు సునీత, ఇందిరా, గీతారెడ్డి, మంగమ్మ మహిళా ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

