ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి..

ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి..
ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాయుడు దామెర కిరణ్(Damera Kiran) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఈ రోజు ములుగులోని మంత్రి కార్యాలయ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు రావాల్సిన రీయింబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రూ.9వేల కోట్ల బకాయిలు(Rs. 9,000 crore dues) పెండింగ్ లో ఉన్నాయన్నారు.
కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు(certificates) ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రావి తేజ, బలీశ్వర్, జస్వంత్, భాను, రాకేష్, భారత్, రత్నం, సురేష్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

