రైతుల‌కు ఆపార‌న‌ష్టం

రైతుల‌కు ఆపార‌న‌ష్టం

గీసుగొండ, ఆంధ్ర‌ప్ర‌భ : అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. తుఫాన్‌ బీభత్సం(Storm damage) రైతుల చేతికందిన పంట‌ను నాశ‌నం చేసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా గీసుగొండ(Geesugonda) మండలంలోని సుమారు 850 ఎకరాల్లో వ‌రి పంట‌, సుమారు 300 ఎక‌రాల్లో ప‌త్తి, కూరగాయలు, తదితర పంటలు నీట మునిగాయి.

ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నీటి పాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అటు పతన చేతికి రాక, సమయానికి విత్తనాలు అందక అలాగే యూరియా(Urea) కొరత వలన త‌మ‌కు ఈ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు పంట నష్టపరిహారం(compensation) అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Leave a Reply