రైతుల్ని ఆదుకోవాలి..
తిరువూరు, ఆంధ్ర ప్రభ : తిరువూరు మండలంలో మొంథా తుపాను కారణంగా వరి, పత్తిచేలకు అపార నష్టం వాటిల్లింది. ఖరీఫ్ సీజన్లో(During Kharif season) సకాలంలో వర్షాలు కురవడంతో దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన రైతులకు మొంథా తీవ్రంగా నష్టం మిగిల్చింది.
తిరువూరు మండలంలోని మునుకుళ్ళు, ఆంజనేయపురం, తిరువూరు. కోకిలంపాడు, ఎర్రమాడు, వావిలాల, అక్కపాలెం, లక్ష్మీపురం గ్రామాల్లో ఎక్కువగా పంటనష్టం వాటిల్లింది. రెండు రోజుల్లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడంతో పల్లపు ప్రాంతాల్లోని పొలాల్లో వర్షపు నీరు చేరి వనిటీలు నీటమునిగాయి. తిరువూరు(Tiruvur)లో 17 వందల హెక్టార్లలో పంటనష్టం వచ్చినట్టుగా అధికారుల ప్రాధమిక అంచనా వేశారు.
వంటనష్టం అంచనా వేస్తున్న అధికారులు..
వంటనష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయ, రెవిన్యూ అధికారులు గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాల(Rythu Seva Kendras) ద్వారా పంటలు నష్టపోయిన రైతుల అధికారులను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కలిగిన నష్టంతో పాటు పాక్షికంగా పంటలకు జరిగిన నష్టాన్ని కూడా నమోదు చేయనున్నారు. ఈ క్రాప్ లో నమోదైన పంటల వివరాల ఆధారంగా ఈ నిష్టాన్ని అంచనా వేస్తారు.
వరికి తీవ్ర నష్టం..
మరికొద్ది రోజుల్లో పంట చేతికి వచ్చే తరుణంలో వరిచేలు అకాల వర్షంతో నీటమునిగాయి. ఇప్పటికే అధిక వ్యయప్రయాసల కోర్చి సాగుచేసిన పైరు కోతకొచ్చిన సమయంలో తుపాను(Tupanu) కారణంగా కలిగిన, నష్టాన్ని అధికారులు గుర్తించి పరిహారం ఇప్పించాలి.
రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి..
మొంథా తుపాను(Montha Tupanu) ప్రభావంతో కురిసిన భారీవర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. అసలే అకాల వర్షాలతో తెగుళ్ళు వ్యాపించి వరి, పత్తి పైర్లు దిగుబడి తగ్గి ఆందోళన చెందుతున్న ర్తెతులకు తుపాను మరింత నష్టాన్ని మిగిల్చింది. పెరిగిన సాగు ఖర్చలతో పంట అమ్ముకున్నా పైసా మిగలని పరిస్ధితుల్లో అసలు పంటలే కోల్పోయే పరిస్థితి నెలకొన్నందున రైతులను ఆదుకోవాలి.

