రహదారి దిగ్బంధం..

యూరియా కోసం రైతుల ఆందోళన
వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ: యూరియా ఎరువుల కొరతతో రైతులు ఆందోళన బాట పట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం, బుదరావుపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద ఈ పరిస్థితి నెలకొంది. యూరియా కోసం ఎదురుచూసి విసిగిపోయిన రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.
ఈ నేపథ్యంలో 365 జాతీయ రహదారిని దిగ్బంధించి, తమ నిరసనను వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల తమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, అధికారులకు తమ గోడు విన్నవించుకోవడానికి, తక్షణమే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు. యూరియా అందకపోతే తమ పంటలు ఎండిపోతాయని రైతులు వాపోతున్నారు.
