MDK | యూరియా దొరక్క రైతుల‌ ఇబ్బందులు..

గజ్వేల్, జులై 29 (ఆంధ్ర ప్రభ) : గజ్వేల్ పట్టణం (Gajwel town)లోని తూప్రాన్ రోడ్డులో ఉన్న తెలంగాణ ఆగ్రోస్ రైతు కేంద్రాన్ని (Telangana Agros Rythu Kendram) గజ్వేల్ నియోజకవర్గ (Gajwel Constituency) బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి (Vanteru Pratap Reddy) బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. రైతులు (Farmers) తమ బాధలను ప్రతాప్ రెడ్డి తెలుపుతూ తమకు యూరియా దొరకడం లేదని, ఇవ్వడం లేదని రైతులు విన్నవించుకొని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈసందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందన్నారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి లైన్ లో నిలబడిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రైతు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వెంటనే గజ్వేల్ నియోజకవర్గంలోని రైతాంగానికి సరిపడా యూరియాను తక్షణమే అందుబాటులోకి తీసుకువచ్చి అందజేయాలని డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాదాస్ శ్రీనివాస్, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, నేతలు మరికంటి కనకయ్య, మల్లేశం, శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కళ్యాణ్ నర్సింగరావు, భూపాల్ రెడ్డి, పాల రమేష్ గౌడ్, హనుమంత్ రెడ్డి, అహ్మద్, గడియారం స్వామి చారి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply