సైదాపూర్, (ఆంధ్రప్రభ): ఎరువుల (fertilizers) కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్ లో నిల్చునే ఓపిక లేక కరీంనగర్ జిల్లా (Karimnagar District) సైదాపూర్ మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో రైతులు (Farmers) తమ చెప్పులను క్యూలైన్ లో పెట్టుకున్నారు.

వెన్నంపల్లి (Vennampally) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (Primary Agricultural Co-operative Society) పరిధిలో గల ఎఖ్లాస్ పూర్ గ్రామంలో గల గోదాం వద్ద ఎరువుల కోసం రైతుల ఎదురుచూపులు చూస్తున్నారు. రైతులు తమ పంటలకు కావలసిన ఎరువుల కోసం బుధవారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. వర్షాకాలం పంటల సాగు వేగంగా కొనసాగుతుండగా, అవసరమైన యూరియా, తదితర ఎరువు సరఫరా ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు.

ప్రభుత్వం యూరియా అందుబాటులో ఉంది అని ప్రకటనలు చేస్తున్నా గ్రామస్థాయి (village level) లో మాత్రం కొరత స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మంది రైతులు తెల్లవారుజామున నుంచే క్యూ లైన్లో నిలబడి ఎరువు కోసం ఎదురుచూస్తుండగా, మరికొందరికి మాత్రం ఎరువులు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎరువుల కొరతపై వ్యవసాయ శాఖ (Agriculture Department) తక్షణ చర్యలు తీసుకొని, ప్రతి రైతు చేతికి సరిపడా యూరియా, తదితర ఎరువులు అందేలా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply