Farmers | మీ చేతిలో రాజకీయ అస్త్రమవుతది

Farmers | మీ చేతిలో రాజకీయ అస్త్రమవుతది

Farmers | గద్వాల (ప్రతినిధి) ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జోగులాంబ అమ్మవారు అంటే నాకు చాలా సెంటిమెంటు అని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ కీలకమైన కార్యక్రమాలు అయిన ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభం ఇస్తానన్నారు. జాగృతి తరఫున భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగిన జోగులాంబ గద్వాల నుంచి ప్రారంభిస్తాం అన్నారు.

నడిగడ్డ ప్రజలు నీతి నియతు ఉన్న మంచి వ్యక్తులు అని అన్నారు. అలాంటి ప్రజల నుంచి గడ్డ నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టిన సరే అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని నమ్ముతున్నానని అన్నారు. ఈ ప్రాంతంలో పెట్టే సభకు ముఖ్య అతిథిగా రావాలని గొంగళ్ల రంజిత్ కుమార్ నన్ను ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. అయితే మహిళా రైతులు సభకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ సీడ్ పత్తి విత్తనమే దేశం మొత్తం వెళ్తుందని కానీ కంపెనీలు మాత్రం ప్రజలను నిమిషం నిమిషానికి వేధిస్తున్నారన్నారు.

Farmers |

రైతులు కష్టాన్ని మిల్లు యజమానుల దగ్గర పెడుతున్నారని కానీ డబ్బులు మాత్రం రావటం లేదని. సీడ్ పత్తి రైతులకు వారం రోజుల్లో బకాయిలు ఉన్నవి విడుదల చేయాలని లేదంటే తెలంగాణలో రైతులందరితో కలిసి ఈ ప్రాంతంలో దీక్ష చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అర్ధరాత్రి కరెంటు ఇవ్వటంతో రైతులంతా కుటుంబాన్ని వదిలి రాత్రి పూట పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇక రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వటం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు.

Farmers |

కుటుంబంలో ఉన్న అందరూ 2 లక్షలు రుణం తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పిండు, కానీ రైతులందరికీ మాత్రం రుణమాఫీ చేయలేదన్నారు. 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి 25 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేశారన్నారు . ఈ లెక్కలపై చర్చకు రావాలని మేము ఛాలెంజ్ చేసిన ప్రభుత్వం సైలెంట్ గా ఉండిపోయిందన్నారు.. ఇంకా 15 లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు..

Farmers |

50 వేలు, లక్ష రుణం తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ కావటం లేదని అన్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రైతు భరోసా వేశాక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడతానని సీఎం చెబుతున్నాడు, రైతు భరోసా అనేది ఎన్నికలకు ఇచ్చే గిఫ్ట్ మాదిరిగా చేస్తున్నారని ఎద్దేవ చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే రైతు గుర్తుకు వస్తున్నాడని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో నారాణయ పేట్ దగ్గర మా తమ్ముడు గవినోళ్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో జాగృతి బోణీ కొట్టిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వడ్డెపల్లి మున్సిపాలిటీని గెలుచుకున్నాం అన్నారు.. గద్వాల్ నుంచే జాగృతి జైత్రయాత్ర మొదలైందన్నారు. గద్వాల్ లో ఉన్న ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, ఏ పార్టీలో ఉన్నావో చెప్పలేని ఎమ్మెల్యే ఎందుకు? అలాంటి వ్యక్తి ప్రజలకు ఏమీ చేస్తాడో ఎలా చెప్పగలడు? అని అన్నారు. నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తే…ఎమ్మెల్సీ పదవికి నిమిషాల్లో రాజీనామా చేశానని, రాజకీయాలు చేయాలంటే ధైర్యం, నియత్ ఉండాలని, ఇప్పటికీ కూడా ఇక్కడి ఎమ్మెల్యే తన జీతం నుంచి బీఆర్ఎస్ కు పార్టీ ఫండ్ వెళ్తుందని చెబుతున్నాడని అన్నారు..

ఇవ్వటానికి ఎమ్మెల్యేకు, తీసుకోవటానికి బీఆర్ఎస్ కొంచెమైనా ఇంగితం ఉండాలన్నారు. తుమ్మిళ్ల, నెట్టింపాడు పనులు నత్త నడకన సాగుతున్నాయని, నత్తాలు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. ఇలా అయితే నడిగడ్డకు నీళ్లు ఎప్పుడు రావాలి. రైతులు గుండె మీద చేయి వేసుకొని ఎప్పుడు హాయిగా ఉండాలి? అన్నారు. నడిగడ్డను పూర్తిగా అన్యాయం చేసి మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతానికి న్యాయం చేయటంలో ఫెయిల్ అయ్యిందన్నారు.

అందుకే మన ప్రతి సమస్యను అడిగే వ్యక్తులే మన ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన అవసరముందని, అందుకే మీకోసం నిలదీసే ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నాం అని మీ ఆశీస్సులు కావాలని మేము తెచ్చే ఆయుధం నడిగడ్డకు నీళ్లు తెచ్చే వజ్రాయుధం అవుతుందన్నారు.. రైతుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు గద్వాలలోని అనంత ఫంక్షన్ హాల్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతిపత్రం అందించారు కల్వకుంట్ల కవిత..

Leave a Reply