Farmers |టమాటా రైతుల సమస్య పరిష్కారం

Farmers | టమాటా రైతుల సమస్య పరిష్కారం
మచిలీపట్టణం, ఉయ్యూరు రైతు బజారుల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు
Farmers | మోపిదేవి, ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో టమాటా రైతుల సమస్య పరిష్కారమైంది. కూరగాయల పంటలకు గుర్తింపు పొందిన మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం, నాగాయతిప్ప, మోపిదేవి లంక గ్రామాల్లో నుంచి ప్రస్తుతం టమాటా దిగుబడి అత్యధికముగా ఉన్న నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారంపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ దృష్టి సారించారు.

తద్వారా శనివారం మోపిదేవి మండల టమాటా రైతులు తామే నేరుగా మచిలీపట్టణం, ఉయ్యూరు రైతు బజారుల్లో విక్రయించుకునేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నిత్యానందరావు, తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరనాధ్, అవనిగడ్డ డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి నల్లగట్ల రమేష్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రత్యేక స్టాల్స్ ద్వారా టమాటా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. టమాటా స్టాక్ విక్రయాలకు మార్గం సుగమం కావటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.

