Farmer | ఖర్చులు జమ చేయండి..!

Farmer | ఖర్చులు జమ చేయండి..!

  • ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకుల డిమాండ్

Farmer | కోడూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి హమాలీ(కాటా) రవాణా ఖర్చులు రైతుల ఎకౌంట్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కోడూరు మండల ఇంచార్జ్ తహసీల్దార్ సౌజన్య కిరణ్మయికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ధాన్యం ప్రభుత్వం వారు కొనుగోలు చేసి నెల రోజులు దాటుతున్నప్పటికీ, ఇంతవరకు హమాలీ, రవాణా ఖర్చులు రైతుల ఎకౌంట్లో జమ కాలేదన్నారు. ఉన్నత అధికారులు స్పందించి రైతుల ఎకౌంట్లో హమాలీ ఖర్చులు వెంటనే జమ చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆవుల బసవయ్య, రేపల్లె యోగ ప్రకాష్, జొన్నలగడ్డ గోపాలరావు, చెక్క వెంకటేశ్వరరావు, కే. భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply