Farmer | రహదారి నిర్మాణానికి భూములు పరిశీలన..

Farmer | రహదారి నిర్మాణానికి భూములు పరిశీలన..
Farmer | నాగాయలంక, ఆంధ్రప్రభ : కృష్ణానది వరదలకు భారీ కోతకు గురైన ఎదురుమొండి పంచాయతీలోని గొల్లమంద- జింకపాలెం జెడ్పీ రహదారిని పటిష్టంగా పునర్నిర్మాణం చేసేందుకు బందరు ఆర్డీఓ పోతురాజు, పంచాయతీ రాజ్ఎ స్ ఈ రమణరావుతో కలసి ఆ ప్రాంతంలోని రైతుల భూములను పరిశీలించారు. సదరు రహదారి నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకోగా, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ రూ.13.8 కోట్లను మంజూరు చేశారు.
ఈ రహదారి నిర్మాణం కోసం సమీపంలోని రైతుల నుంచి భూమిని కొనుగోలు చేయాల్సివుంది. ఈ ప్రాంతంలోఎకరా భూమి మార్కెట్ విలువ 3.88 లక్షలుగా ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. సదరు రహదారి నిర్మాణానికి ఎంత భూమి కావాలో నివేదికను రూపొందించి జిల్లా అధికారులకు నివేదించ నున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డీఈఈ మోజేస్, తహశీల్దార్ వీరాంజనేయ ప్రసాద్, ఏఓ ఎ.సంజీవ కుమార్, విఆర్వోలు మేడికొండ భిక్షం, గోవింద రాజులు, గ్రామ ప్రముఖుడు కన్నా వెంకటేశ్వరరావు,
సిబ్బంది పాల్గొన్నారు.
