Jharkhand | సెల్ఫీ పిచ్చి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఫ్యామిలీ

జార్ఖండ్ : సెల్ఫీ పిచ్చి ఓ కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టింది. సెల్ఫీ (selfie) తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అప్రమత్తమైన స్థానికులు, మత్స్యకారులు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్‌ (Jharkhand)లోని ధన్‌బాద్ సమీపంలో గల ప్రసిద్ధ భటిండా జలపాతం వద్ద జరిగిందీ ఘటన.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ (Bardhaman) జిల్లాకు చెందిన ఓ కుటుంబం భటిండా జలపాతం (Bhatinda Falls) సందర్శనకు వెళ్లింది. అక్కడ జలపాతం వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడిపోయింది. అప్రమత్తమైన భర్త, పిల్లలు ఆమెను రక్షించేందుకు వెంటనే నీటిలోకి దూకేశారు.

జలపాతం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నలుగురూ మునిగిపోయి కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న జాలర్లు వారిని గమనించి నీటిలోకి దూకి వారిని రక్షించడంతో ఆ ఫ్యామిలీ ప్రాణాలతో బయటపడింది. వారంతా ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply