కూలిన చెట్లు, విద్యుత్తు స్థంభాలు..

మండపేట, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావం కు ముందే మంగళవారం మండపేట లో ఈదురు గాలులకు చెట్లు పడిపోయాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడ్డాయి. మరికొన్ని చోట్ల వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఉదయం నుండి మొత్తం మండపేట లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బురుగుంట చెరువు వద్ద భారీ చెట్టు కూలిపోయింది.

ఇది విద్యుత్ లైన్ పై పడింది. నేలటూరు రోడ్ లో విద్యుత్ స్తంభం నెలకొరింది. ఇలా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఈ నేపద్యంలో విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ పునరుద్ధరణ కు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. మెయిన్ లైన్ లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం తో ఇక విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

తుఫాన్ తీరం దాటే సమయం మరింత వేగంగా గాలులు వీచే అవకాశం ఉంది.దీంతో విద్యుత్ సరఫరా మరో 24 గంటల కు పైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply