TPT | నకీలి పోలీస్.. జాగ్రత్త..

TPT | నకీలి పోలీస్.. జాగ్రత్త..


TPT | తిరుపతి జిల్లా, భాకరాపేట, ఆంధప్రభ : సీఐ అంటూ శివకుమార్ (Sivakumar) అనే వ్యక్తి భార్యాభర్తలను బెదిరించాడు. చిన్నగొట్టిగల్లు మండలం, జంగా వాండ్ల పల్లి పంచాయతీ అప్పేపల్లిలో ఈ సంఘటన జరిగింది. రెడ్డి ఈశ్వర్, భానుశ్రీ అనే దంపతుల మధ్య ఉన్న విభేదాల్లో జోక్యం చేసుకొని శివకుమార్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అనుమానం వచ్చిన బాధితుడు రెడ్డి ఈశ్వర్ భాకరాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు క్రైమ్ నెంబర్ 78/2025గా కేసు నమోదు చేశారు. అయితే.. కె.వి పల్లి మండలం పెద్దకంపల్లికి చెందిన శివ కుమార్.. కడప స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చలామణి అవుతున్నట్టుగా గుర్తించారు. ఎస్సై రాఘవేంద్ర.. నేడు లేదా రేపు శివ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనున్నారు.

Leave a Reply