Fake| నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్

నంద్యాల బ్యూరో జూలై 21 ఆంధ్రప్రభ… నంద్యాల జిల్లాలో నకిలీ పాసుబుక్కుల వ్యవహారం గుట్టు రట్టు చేసిన పోలీసులు. 12 నకిలీ పాస్ పుస్తకాలు ఐదు టైటిల్ లీడ్ బుక్కులు స్వాధీనం చేసుకున్నారు.నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని సంజామల మండలంలో నకిలీ పాసుబుక్కుల వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ అధి రాజ్ సింగ్ రాణ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ డి.ఎస్.పి కొలిక పూడి ప్రమోద్, కోవెలకుంట్ల సీఐ హనుమంత నాయక్ లు తెలిపిన వివరాల మేరకు నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాల తయారీ ముఠాను సోమవారం సంజామల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 12 నకిలీ పాస్ పుస్తకాలు ఐదు టైటిల్ లీడ్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నంద్యాల పట్టణానికి చెందిన సాయిబోయిన ఉపేంద్ర, సంజామల గ్రామానికి చెందిన ఈ పూరి వరప్రసాదు, గడివేముల గ్రామానికి చెందిన దూదేకుల మహమ్మద్ రఫీ లను అరెస్టు చేసి వారి నుంచి 12 పాస్ బుక్కులు 6 టైటిల్ లీడ్ బుక్కులు స్వాధీనం చేసుకున్నా మని తెలిపారు…….

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…… సంజామల మండలంలో భూమి వ్యవహారంలో అనుమానం వచ్చినటువంటి ఆనాటి తాహసిల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూ కుంభకోణ వ్యవహారం డొంకంతా కదిలింది.2023వ సంవత్సరంలో సంజామల మండల తాసిల్దార్ జీ.వి. మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంజామల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. సంజామల మండల తాసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్, సంజామల గ్రామానికి చెందిన ఉపేంద్రలు నకిలీ పాస్ పుస్తకాలను తయారుచేసి లేని భూమిని ఉన్నట్లుగా చూపించారు.

సంజామల మండలంలోని పేరు సోముల, గిద్దలూరు, ఆర్. లింగం దిన్నె, ముదిగేడు గ్రామ పరిసర ప్రాంతాల్లో కొత్త సర్వే నంబర్లు సృష్టించరు. 55 మందికి పాస్ బుక్కులు ఇచ్చి ఆన్ లైన్ లో ఎక్కించినారు. ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు చొప్పున డబ్బులు ఇచ్చిన వారి పేరుపై రాసి ప్రజల వద్ద నుండి ఒక్కొక్క పాసుబుక్కు కు 30 వేల రూపాయల డబ్బులు తీసుకుని ఇచ్చినారని పోలీసులు తెలిపారు.

నకిలీ పాస్ పుస్తకాలు తీసుకున్న వారిలో సుమారు 49 మంది వివిధ వేరు వేరు బ్యాంకుల్లో సుమారు 80 లక్షల రూపాయలు రుణం కూడా తీసుకున్నారు. వారందరూ కూడా రుణాలు తీసుకున్న బ్యాంకులు తిరిగి చెల్లించాలని లేనిచో వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించటం విశేషం….

తవ్వే కొద్ది అక్రమాలు…..

నకిలీ పాసుబుక్కుల వ్యవహారంలో తవ్వే కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ కేసులో దర్యాప్తులో ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. ఉపేంద్ర కు బషీరా అమ్మకు తెలిసిన సంజామల గ్రామానికి చెందిన ఈ పూరి వరప్రసాద్, గడివేముల గ్రామానికి చెందిన దూదేకుల మహమ్మద్ రఫీ, దూదేకుల పెద్ద జమాల్ బాషా, కర్నూల్ టౌన్ కు చెందిన అబ్దుల్ సత్తార్,కంపమల్ల గ్రామానికి చెందిన వరప్రసాద్ లు అమాయకమైన ప్రజలను ఎన్నుకొని వారికి నిజం చెప్పకుండా లేని భూమిని ఉన్నట్లుగా చెప్పి ఈ నకిలీ పాస్ పుస్తకాలను ఇవ్వడం జరిగిందన్నారు.

2018 వ సంవత్సరంలో అప్పటి ఎమ్మార్వో ఎద్దుల ఎలిజబెత్ ఆన్లైన్ కు అప్రూవల్ చేసింది అని తెలిపారు. 06 సర్వే నంబర్లు సృష్టించి 321.83 ఎకరాలు లేని భూమిని ఉన్నదిగా చూపించి 67 మంది పేర్లపై ఆన్లైన్లో ఎక్కించినారు. 55 మంది వ్యక్తులకు పాస్బుక్కులు ఇచ్చినారు. … 12 పాస్ బుక్కులు 5 టైటిల్ లీడ్స్ స్వాధీనం……నకిలీ పాసుబుక్కులు తయారు చేసిన వ్యక్తుల వద్ద నుంచి మొత్తం 12 పాస్ బుక్కులు మరియు ఐదు టైటిల్ లీడ్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పాసుబుక్కులు తీసుకున్న వారందరూ సంజామల కోవెలకుంట్ల గడివేముల నందికొట్కూరు కర్నూలు జిల్లాలో మరికొందరు ఉన్నట్లుగా దర్యాప్తుల్లో తేలిందని పోలీసులు తెలిపారు. పాసుబుక్కులు టైటిల్ లీడ్ తీసుకున్న 55 మంది వ్యక్తులు వివిధ రకాల బ్యాంకుల్లో తీసుకున్న లోన్లను,ప్రభుత్వ సొమ్ము ను లోన్ కింద తీసుకొని వారందరూ లోన్లు తిరిగి కట్టాలని,లేకపోతే వారు కూడా ఈ కేసులో ముద్దాయిలు అవుతారని పోలీసులు తెలిపారు.

Leave a Reply