Fake notes | నకిలీ నోట్లు స్వాధీనం

Fake notes | నకిలీ నోట్లు స్వాధీనం
Fake notes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కృత్తివెన్ను మండలం సంగముడిలోని ఓ వైన్ షాపులో నకిలీ నోట్లను గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
దీనితో పోలీసులు పెందుర్తి మండలం కోకవణిపాలెంలో అద్దె ఇంట్లో దొంగనోట్లను ముద్రిస్తున్న నిందితులు రంజిత్ సింగ్, బ్రహ్మ ఉమాశంకర్, దీలిప్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6,02,400 విలువైన నకిలీ నోట్లు, వాటిని ముద్రించడానికి ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
