ఎఫ్1 కామేష్ బాబు సస్పెన్షన్. ఇంతకీ ఎవరితను..?

ఎఫ్1 కామేష్ బాబు సస్పెన్షన్. ఇంతకీ ఎవరితను..?
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పురపాలక సంఘంలో పారిశుద్ధ్య కార్మికులకు 20 ఏళ్లుగా రావాల్సిన ఇంక్రిమెంట్లు, స్పెషల్ ఇంక్రిమెంట్ బిల్లుల వ్యవహారంలో సుమారు రూ.12 లక్షలకు పైగా లంచాలు వసూళ్లు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ఎఫ్1 కామేష్ బాబును పురపాలక సంఘ ప్రాంతీయ సంచాలకులు నాగ నరసింహారావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కామేష్ పై వచ్చిన ఆరోపణలు పూర్తి స్థాయిలో విచారణ చేసేంత వరకు సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని ఉత్తర్వులలో సూచించినట్లు పురపాలక కమిషనర్ సింహాద్రి మనోహర్ స్పష్టం చేశారు. గతంలో పత్రికల్లో ఈ విషయమై పలు కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే.
