కేఆర్‌కే కాలనీలో పోలీసుల విస్తృత తనిఖీలు

70 మోటార్ బైకులు, 15 ఆటోలు, కారు, 29 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : రాష్ట్రంలోనే అతి పెద్ద జనావాసం కలిగిన ఆదిలాబాద్ (Adilabad) కేఆర్ కే కాలనీలో ఆదివారం ఉదయం జాగిలాల సాయంతో 200 మంది పోలీసులు (Police) విస్తృత తనిఖీలు నిర్వ‌హించారు. పోలీసు జాగిలాలు, మెటల్ డిటెక్టర్లు, 200 మంది పోలీసులు ఆకస్మికంగా తెల్లవారు నుండే కమ్యూనిటీ కాంటాక్ట్ పేరిట ఇంటింటా కార్డెన్ సెర్చ్(Carden Search) తనిఖీలు నిర్వ‌హించారు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) ఆదేశాల మేరకు ప్రజల సంరక్షణ, భద్రత ప్రధాన లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించామని డీఎస్పి ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. నార్కోటిక్ డాగ్ తనిఖీల్లో ప‌ది గ్రాముల రెండు గంజాయి (Ganjai) కూడా లభ్యమైంది.

70 మోటర్ బైక్ లు, 15 ఆటోలు సీజ్..!
కేఆర్‌కే కాలనీ (KRK Colony)లో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్డెన్ సెర్చ్ లో సరైన డాక్యుమెంట్లు లేని 70 మోటార్ బైకులు, 16 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నిజ నిర్ధారణ కోసం పరిశీలించారు. అదేవిధంగా 29 మద్యం బాటిళ్లు కూడా స్వాధీనపరుచుకున్నామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీల్లో మావల సీఐ కర్ర స్వామి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, కె ఫణిదర్, ప్రేమ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి,ఎన్ చంద్రశేఖర్, ఎస్ఐలు, ఏసైలు హెడ్ కానిస్టేబుల్ లు, రిజర్వ్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply