కావూరి సాంబశివరావు సేవలు చిరస్మరణ

కావూరి సాంబశివరావు సేవలు చిరస్మరణ
జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ కావూరి సాంబశివరావు సేవలు చిరస్మరణీయమని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు.
శనివారంహైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఇటీవల మృతి చెందిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు కావూరి సాంబశివరావు సంస్మరణ కార్యక్రమంలో ఉదయభాను పాల్గొని సాంబశివరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసినట్లు తెలిపారు.
