బర్మా సర్కారుకు కునుకులేకుండా చేసిన రెబల్స్
అంతర్గత తిరుగుబాటు.. ప్రజా జీవనానికి తిప్పలు
ఏం చేయాలో తెలియని మయన్మార్ ప్రభుత్వం
సమస్యను పట్టించుకోని పక్క దేశాలు
భారత్‌ను శరణుకోరిన నాటి బర్మా ప్రధాని
రంగంలోకి దిగిన ఇండియన్ స్పై ఏజెన్సీ
రెబల్స్‌కు చుక్కలు చూపిన మిలటరీ ఇంటెలిజెన్స్
40 నిమిషాల్లోనే 70 మంది రెబల్స్ హతం
రా స్పెషల్ టాస్క్‌లలో ఇదో స్పాషాలిటీ
ఆపరేషన్ లీచ్‌తో ప్రపంచానికి కనువిప్పు
మళ్లీ ఇప్పటిదాకా తలెత్తని రెబల్స్ సమస్య
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
అది 1998.. మయన్మార్‌లో అంతర్గత తిరుగుబాటు తలెత్తింది.. సమస్యను ఎట్లా పరిష్కరించాలో ఆ దేశ ప్రధానికి అర్థం కాలేదు.. రోజు రోజుకూ రెబల్స్ ఒక్కో సిటీని హస్తగతం చేసుకుంటూ వస్తున్నారు. పక్క దేశాలైన చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్ సహకారం కోరినా వాళ్లేమి చేయలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో బర్మా ప్రభుత్వం భారత సర్కార్‌ను శరణుజొచ్చింది. కాపాడండి మహా ప్రభో.. మమ్మల్ని మీరే రక్షించాలి అని వేడుకోవడంతో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. మయన్మార్ సర్కారును కాపాడేందుకు ఇండియన్ స్పై ఏజెన్సీ రా.. రంగంలోకి దింపింది..
ఆయుధాలు, డబ్బు ఇచ్చి మరీ..
తొలుత ప్రజాస్వామ్యవాద గ్రూపులకు భారత మిలటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) డబ్బులతో పాటు ఆయుధాలను సప్లయ్ చేసింది. అయితే.. మయన్మార్ రెబల్స్ చాలా పకడ్బందీగా వ్యవహరించారు. భారత్ ఆర్మీని దగ్గరికి రానివ్వలేదు. వారి వివరాలు బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే.. రెబల్ లీడర్ల వివరాలను అంతకుముందే భారత స్పై ఏజెన్సీ రా తెలుసుకోవడంతో పనికాస్త ఈజీ అయ్యింది. ముందు రెబల్ సైన్యం కంటే.. వారికి నిధులు, ఆయుధాలు అందిస్తున్న నాయకులను లేపేశారు. ఆ తర్వాత ఏం తిరుగుబాటు చేయలేని స్థితిలో రెబల్ సైన్యం భారత బలగాలకు లొంగిపోయింది. ఈ ఆపరేషన్ తర్వాత మయన్మార్‌లో మరో రెబల్ గ్రూప్ ఇంతవరకు పుట్టుకురాలేదు.

