Excellence award | గొప్ప మానవతావాది..

Excellence award | గొప్ప మానవతావాది..

  • మానవతావాది వైకుంఠ రావుకు నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు..
  • కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేతులు మీదుగా అవార్డు ప్రదానం..

Excellence award, న్యూఢిల్లీ,ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి : మానవతావాది వై వైకుంఠ రావు (వైకుఠం)కు నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు -2025 దక్కింది. శనివారం న్యూఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రాందాస్ అథవాలే (Ramdas Athawale) చేతులు మీదుగా వైకుంఠం అవార్డును అందుకున్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశంలో స్వేచ్ఛ, సమానత్వం కోసం పాటుపడే వారికి అవార్డులు అందించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన వై వైకుంఠరావును అవార్డుకు ఎంపిక చేసింది. “గాస్పల్ మినిస్ట్రీస్” అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వైకుంఠం అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.

అలాగే, రాకడవారి వృద్ధాశ్రమం నెలకొల్పి అనాథలైన వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. తరచూ అన్నదానాలు నిర్వహిస్తుంటారు. పేదలకు దుస్తులు అందజేస్తుంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడుతుంటారు. వైకుంఠం సేవలకు గుర్తింపుగా అంబేద్కర్ గ్లోబల్ ఫౌండేషన్ నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డుకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డుకు వైకుంఠం ఒక్కరే ఎంపిక కావడం గమనార్హం. అవార్డు దక్కిన సందర్భంగా వైకుంఠరావు మీడియాతో మాట్లాడారు. అవార్డు తనలోని సేవాభావాన్ని మరింత మేల్కొలిపిందని తెలిపారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తానని చెప్పారు.

Leave a Reply