Exam | తల్లిదండ్రులు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి…

Exam | తల్లిదండ్రులు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి…
Exam | కొత్తచెరువు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మార్నింగ్ స్కూల్స్ అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఉదయం 8:00 – మధ్యాహ్నం 12:30, 12:30కి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులు ఇళ్లకు వెళ్లే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో… మధ్యాహ్నం 1:00 – సాయంత్రం 5:00 వరకు క్లాసులు ఉంటాయి. పదవ తరగతి పరీక్షలు… 9:30 – మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు సమయాలను గమనించి ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి నెలలోని ఎండల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఎండ బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
