EX MPP | అందుబాటులో ఉండి సేవలందిస్తా

EX MPP | అందుబాటులో ఉండి సేవలందిస్తా
ఇస్కిల్ల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పైళ్ళ చందన వెంకటరెడ్డి
EX MPP | రామన్నపేట, ఆంధ్రప్రభ : ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవకురాలిగా ఇస్కిల్ల గ్రామ ప్రజలకు సేవలందిస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పైళ్ళ చందన వెంకటరెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం 5వ వార్డు,7వ వార్డు, 1వ వార్డులో పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.గ్రామ ప్రజలు ఒకసారి తనకు సర్పంచ్ గా అవకాశం కల్పించాలని, ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. తనకు గ్రామ ప్రజలు మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. వీరి వెంట మాజీ ఎంపీపీ పైళ్ల పద్మజ, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
