వైసీపీ భ్రమవద్దు  

 అధికారులపై మాజీ ఎమ్మెల్యే భూమా  ఫైర్​

 ( నంద్యాల , ఆంధ్రప్రభ బ్యూరో)  

నంద్యాల నియోజక వర్గంలోని గోస్పాడు మండలంలో పొదుపు సంఘాలపై అధికారుల   పనితీరుపై మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి (EX MLA Bhuma Brahma nanda Reddy)  ఆగ్రహం వ్యక్తం చేశారు.  శుక్రవారం గోస్పాడు మండలంలోని ఒంటి వెలగల (onti velagala), కానాలపల్లె (Kanalapalle),   గ్రామాలలో వైసీపీ కార్యకర్తలకే  పనులు ఎలా జరుగుతున్నాయి?  అంటూ అధికారులను నిలదీశారు .టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా… ఇంకా వైసీపీ ప్రభుత్వ కాలాన్ని తలపించే రీతిలో  కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  గోస్పాడు మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ ఐక్య సంఘాలు (dwakra socities), పొదుపు లక్ష్మి (podupu laxmi sangaalu) సంఘాల పేరుతో అక్రమ మార్కులకు  కొందరు ఎస్ ఈ ఆర్ పి అధికారుల ( SERP Oficials)  తీరు సరికాదన్నారు.కానాలపల్లి గ్రామంలో ప్రస్తుతం ఎన్నికై విధులు నిర్వహిస్తున్న గ్రామ ఐక్య సంఘం అధ్యక్షురాలు వంగళ శివపార్వతిని (Vangala Siva Parvathi) పక్కనపెట్టి, ఎలాంటి అవకతవకలు లేని పొదుపు సంఘాల్లోని  నాయకులను తొలగిస్తూ… ప్రతిపక్షానికి అనుకూల వ్యక్తులను ఏకపక్షంగా నియమించే ప్రయత్నం జరిగినట్టు  బయటపడిందన్నారు.

గ్రామ పొదుపు సంఘ సభ్యులతో సమావేశం పెట్టకుండా, నోటీసులు (notice) ఇవ్వకుండా, కమిటీ సభ్యులతో చర్చించకుండా, కొత్త గ్రూపులను సృష్టించడం, బ్యాంకులకు అకౌంట్లు మార్చాలని (changing bank accounts) లెటర్లు పంపించటం అధికారుల బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అన్నారు. గ్రామాల స్త్రీశక్తి సంఘ మహిళలు  మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి లు కలిసి గోస్పాడు మండల స్త్రీశక్తి భవన్‌కు చేరుకుని  అధికారులను నిలదీశారు. “ప్రజాస్వామ్యంగా ఎన్నికైన కమిటీలను పక్కనపెట్టి, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, మీటింగ్ కూడా పెట్టకుండా ఇలాంటి మార్పులు ఎలా చేస్తారు?” అంటూ ఆయన  (Fired on officers)అధికారులను గట్టిగా ప్రశ్నించారు. “ప్రజల స్వాధీన హక్కులను దెబ్బతీసే ఇలాంటి చర్యలను టీడీపీ ప్రభుత్వం సహించదన్నారు.సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నేను ఇక్కడినుంచి వెళ్లను అని స్పష్టం చేశారు. కేవలం సంఘాల మార్పులు మాత్రమే కాకుండా, ఒకే కార్యాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు అధికారులు one post two officers)  విధులు నిర్వహిస్తున్న వ్యవహారం కూడా బయటపడడంతో గోస్పాడు మండలంలో అధికార యంత్రాంగం పనితీరుపై పెద్ద చర్చ మొదలైంది. ఈ లోపాలన్నింటినీ వెంటనే సరి చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే భూమా డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు.  

Leave a Reply