EX MLA | ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా…

EX MLA | ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా…
- వడ్డెరులంటే సీఎం కు ఎంతో అభిమానం…
- వడ్డెరులను ఎస్ టీ జాబితాలో చేర్చే బాధ్యత మంత్రి బి సి జనార్దన్ రెడ్డి తీసుకోవాలి…
- మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి…
- రాష్ట్రము లోని వడ్డెర కులస్థులు అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంతో అభిమానమని,
EX MLA | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వడ్డెర కులస్థుల న్యాయమైన డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Ex MLA Byreddy Rajasekhar Reddy) హామీ ఇచ్చారు. ఆదివారం జిల్లా వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుకున్నారు. వడ్డెరలు రాజకీయంగా, ఆర్థికంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, సమాజ అభివృద్ధిలో వడ్డెరల పాత్ర ఎంతో కీలకమన్నారు. యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ప్రజలకు ఉపయోగపడే దిశగా ముందుకు సాగాలని సూచించారు. మంత్రి బి సి జనార్దన్ రెడ్డి, మంత్రి ఫరూక్ లు వడ్డెర కులస్థుల న్యాయమైన డిమాండ్, వడ్డెర కులాన్ని ఎస్. టీ జాబితాలో చేర్చే బాధ్యత తీసుకోవాలన్నారు.
అసెంబ్లీ లో తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వం కు పంపేలా చూడాలని సలహా ఇచ్చారు. మైనింగ్ రంగంలో వద్దేరులకు రాయల్టీ సభ్యత్వం, లీజ్ అనుమతిపై ప్రత్యేక హక్కులు కల్పించేలా ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యా పరంగా వడ్డెరలు బలోపేతం కావాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు వడ్డే చక్రధర్, నాగరాజు లు మాట్లాడురు.వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నంద్యాల (Nandyala) పట్టణంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆయన పేరుతో కమిటీ హాల్ నిర్మించాలని సూచించారు.
అలాగే జిల్లా వ్యాప్తంగా వడ్డెర కులస్థులకు రాజకీయ నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించాలని, శ్రీశైలంలోని అఖిల భారత శ్రీశైల వడ్డే, వడ్డెర, ఒడియ రాజుల నిత్య అన్నదాన సత్రంలో జరుగుతున్న అక్రమాలకు ముగింపు పలికి నూతన కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ రంగంలో వడ్డెరలకు రాయల్టీ సభ్యత్వం, లీజ్ పర్మిషన్లపై ప్రత్యేక హక్కులపై అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వడ్డెర కుల ధ్రువీకరణ పత్రాల్లో వడ్డెర, ఒడియ వడ్డెర, వడ్డె రాజులు అనే పేర్లు స్పష్టంగా నమోదు అయ్యేలా తీర్మానం చేయాలని, ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో వడ్డెరలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో వడ్డెర సంఘ నాయకులు శ్రీను, రామాంజనేయులు, జనార్థన్, శ్రీరాములు, వెంకటసుబ్బయ్య, రామకృష్ణ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
