అందరూ పాల్గొనాలి..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్(Vaibhav Gaikwad Raghunath) ఆదేశాల మేరకు, రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా అచ్చంపేట డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దేశ సమైక్యతా స్ఫూర్తిని, ఐక్యతను ప్రతిబింబించే “రన్ ఫర్ యూనిటీ(Run for Unity)” ప్రత్యేక పరుగు ఫోటి కార్యక్రమం అక్టోబర్ 31 శనివారం నాడు ఉదయం 6 గంటలకు అచ్చంపేట పోలీస్ స్టేషన్ నుండి రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించబడుతుందని అచ్చంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు.
అచ్చంపేట ప్రాంత ప్రజలు, యువత, ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సిఐ నాగరాజు కోరారు. ఈ పరుగు పోటీ కార్యక్రమంలో పాల్గొనేవారు టీ షర్ట్, లోయర్ మరియు షూస్, ధరించి రావాలని ఆయన కోరారు.

