మోమిన్ పేట్, మే 9 (ఆంధ్రప్రభ): నేటి సమాజంలో జీవించే ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన అత్యవసరమైనదని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మోమిన్ పేట మండల పరిధిలోని సయ్యదలిపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నవగ్రహ ప్రతిష్టాపన, నాభి శిలా (బొడ్రాయి) దాన్యాదివాసము, జలాధివాసము వంటి కార్యక్రమాలను వేద బ్రాహ్మణోత్తముల చేత వేదమంత్రాలతో నిర్వహించారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మారుమూల గ్రామమైన సయ్యదలి పూర్ గ్రామంలో ప్రజలకు ఇంత ఆధ్యాత్మిక చింతన ఉండడం నిజంగా గ్రామ ప్రజలు అదృష్టవంతులన్నారు. నేటి ఆధునిక సమాజంలో ఎన్నో సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు ఉన్న సమయంలో ఆధ్యాత్మిక చింతనతో ఇలాంటి దైవ కార్యక్రమాలు నిర్వహించడం గ్రామానికి శుభ సూచకమన్నారు.
ఈకార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నర్వోత్తం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సుభాష్ గౌడ్, మాణయ్య, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సురేందర్, ఎరాజ్, సుభాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బంటు వెంకటేశం, సయ్యదలిపూర్ గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నారాయణ రెడ్డి, అంజిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, గ్రామపెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధం ప్రసాదాలు స్వీకరించారు.