మందలించినా మారకపోవడంతో…..

మందలించినా మారకపోవడంతో…..

తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : విద్యా, బుద్దులు నేర్పే ఓ ఉపాధ్యాయుడు బుద్ధి తక్కువ పనులు చేసి కీచక రూపం దాల్చాడు. విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంభ సభ్యులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించడంతో ఉపాధ్యాయుడుపై ఫోక్సో కేసు నమోదయ్యింది. ఈ సంఘటన తాండూరు మండలంలో జరిగింది. తాండూరు రూరల్ సీఐ నగేస్, కరణ్ కోట్ ఇంచార్జ్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని ఓ గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల జరిగిన బతుకమ్మ సంబరాలలో స్నేహితులతో కలిసి ఉన్న బాలికను టీచర్ చేయిపట్టి లాగడంతో జరిగిన సంఘటనపై హెచ్ఎంకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తరువాత కూడా టీచర్ రాఘవేందర్ రెడ్డి బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. హెచ్ఎం పలుమార్లు మందలించినా పద్ధతి మార్చుకోలేదు.

బుధవారం మరోసారి టీచర్ రాఘవేందర్ రెడ్డి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. హెచ్ఎం ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో బాలిక ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. ఈ రోజు ఉదయం కుటుంభీకులు పాఠశాలకు చేరుకుని టీచర్ రాఘవేందర్ రెడ్డిని నిలదీశారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పట్ల దేహశుద్ది చేశారు. అనంతరం ఉపాధ్యాయుడుని కరణ్ కోట్ పోలీసులకు అప్పగించారు. టీచర్ పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు రూరల్ సీఐ నగేష్. ఇంచార్జ్ ఎస్ఐ విఠల్ రెడ్డిలు దర్యాప్తు చే పట్టారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు రాఘవేందర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఇదే విషయంపై మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ స్పందిస్తూ ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆరా తీయడం జరిగిందని తెలిపారు. చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేధిక అందించడం జరుగుతుందని చెప్పారు.

Leave a Reply